పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ ఇది. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు.
ఇది మహిళలకి సంబంధించిన కథ. కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత ఉంది. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెంట్ ఉంది. అలాగే ప్రతి క్యారెక్టర్‌కి లేయర్స్ ఉంటాయి.
‘మ్యాడ్’ తర్వాత మంచి కథ కోసం వెయిట్ చేశాను. ఈ కథలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. నాకు యాక్షన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. నటనకు చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ చేయటం మరింత ఆనందంగా ఉంది.
ఈ కథ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. లిటరల్‌గా ఏడ్చేశాను. అంత ఎమోషనల్‌గా ఉండే కథ ఇది. నేను శుద్ధి యోగ్య పాత్రలో కనిపిస్తాను. తను ఒక రచయిత, అలాగే తనకి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది. ఇదొక ప్యూర్ లవ్‌స్టోరీ ఇది. రియల్‌గా ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్‌కి రిలేట్ అవుతుంది అదే ఈ ప్రేమకథలో ప్రత్యేకత.
నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. ఈ సినిమా కోసం కళరి ఫైట్ నేర్చుకున్నాను. అలాగే ఫైట్ కోసం చైైనీస్ ఆర్ట్ ఫామ్‌ని కూడా నేర్చుకున్నాను. దాని కోసం మూడు నెలలు అంజి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. డైరెక్టర్ ఫణీంద్ర నాకు గురువు లాంటి వారు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన క్లియర్ విజన్‌తో ఉంటారు. చాలా పాషనేట్ ఫిలిం మేకర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.
హేషమ్ రెండు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెండు పాటలు ఆడియన్స్‌కి చాలా నచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్‌తో వర్క్ చేయడం అదృష్టం. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టులో తీసుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఇలాంటి సినిమాని తీయడానికి చాలా గట్స్ కావాలి.
మహిళలకు సంబంధించిన కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES