
నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత ప్రభుత్వం కల్పించాలని మహాజన పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కోఆర్డినేటర్ నెమలి నరసయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సఫాయిగా పనిచేస్తున్న ఎలమర్తి అలెగ్జాండర్ కుమారుడు క్షయవాదితో మృతిచెందగా ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో భౌతికకాయాన్ని సందర్శించి సానుభూతి వ్యక్తం చేసి అలెగ్జాండర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో పనిచేయుచున్న ప్రతీ పారిశుద్ధ్య సిబ్బంది తో పాటు కుటుంబ సభ్యులకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలో పనిచేయుచున్న సిబ్బందికి క్షయ వ్యాధి తో పాటు అన్ని వ్యాధులు ప్రతి కుటుంబంలో ఉన్నారని, ప్రతి రోజుఉదయం తెల్లవారుజామున 4:30 5:00 నుండి దమ్ము ధూళి గ్రామ పారిశుద్ధ నిర్వహణలో తలమునకులైనటువంటి గ్రామపంచాయతీ సిబ్బందిని, ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉమ్మడి జిల్లా స్థాయిలోని ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ స్థాయి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించే విధంగా ప్రభుత్వం కార్యచరణ చేయాలని అన్నారున
పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగ పాటు కుటుంబ సభ్యులలో భార్య తో పాటు నామినిలకు తో సహా దీర్ఘకాలిక ప్రాణాంతకమైన వ్యాధుల పట్ల పంచాయతీ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంయుక్తంగా జీవిత బీమా ( లైఫ్ ఇన్సూరెన్స్) పథకమును ప్రవేశపెట్టి ప్రతి పంచాయతీ ఉద్యోగికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వారి కుటుంబానికి కూడా వర్తించే విధంగా ఆ దిశగా ప్రభుత్వాలు చట్టం చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పుడు అరకోర జీతాలతో బతుకుతున్న పంచాయతీ సిబ్బంది పట్ల ఏ ప్రభుత్వాలు మారినా గ్రామాలలో పనిచేయుచున్న పారిశుద్ధ్య సిబ్బంది బ్రతుకులు మారలేదని ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలు శుభ్రంగా స్వచ్ఛభారత్ అనే అంశం పైన మా జీవితాలను ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మహాజన పారిశ్యుద్ద కార్మికుల & ఉద్యోగుల సమాఖ్య (జిపి ఎంఆర్ఎఫ్) గోవిందరావుపేట మండల ఇంచార్జ్ దూస్స సతీష్ మహాజన్ దొంగరీ ఉప్పలయ్య నరసమ్మ వేమునూరీ శివప్రసాద్ యాశ సంజీవరెడ్డి ఏర్ర శ్రీకాంత్ ఎంపీటీసీ గోపి దాసు ఏడుకొండలు గ్రామస్తులు పాల్గొన్నారు.