ఎన్నాళ్ళు…ఈ ఇబ్బందులు..?

– గ్యాస్ టీఏ, డీఏ బిల్లులు, రికార్డులు, రెండు నెలల వేతనం ఇంకెప్పుడు..
– మండు టెండల్లో  టీచర్లను ఇబ్బందులు పెడుతున్న ఐసీడీఎస్ డిపార్టు మెంట్
– సర్వేలు అర్జెంట్ -అర్జెంట్ అంటూ టార్చర్
నవతెలంగాణ – పెద్దవూర
మే-నెల్లో ఎక్కడైనా ఏ అంగన్వాడీ టీచర్ చనిపోయిన  అక్కడి ఆఫీసు స్టాప్ దే బాధ్యత అని సర్వే వల్ల ఇంత టార్చర్ అనుభవించాల్సి వస్తుందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎండల్లో కూడా నెలకు నాలుగు సార్లు మీటింగులు పెట్టు టార్చర్ పెడుతున్నారని
అందుకోసం వాళ్లే బాధ్యత వహించాలని అనుమల ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు  అందరి లాగా మనుషులు గారా.. ఇలాంటి రిపోర్ట్ లు ఇంటి దగ్గర కూర్చొని  చేసుకో లేమా? ఎవరి సెంటర్లో వాళ్ళు కూర్చొని చేసుకోమా ? కావాలని వేధించి పిలిపించి ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపించారు. నిడమానూరు సెక్టార్ పరిధిలో  ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందని వచ్చిన అంగన్వాడీ టీచర్లను సాయంత్రం 5 గంటల వరకు కూడా పంపించ లేదని తెలిపారు. ఆఫ్ డే స్కూల్ అంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తూ సాయత్రం వరకు ఉంచారని అక్కడి టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడి ఊర్లో నుంచి  వస్తున్నాము అనేది ఆలోచించకుండా సాయత్రం 5 గంటలకు వరకు మీటింగ్లు పెట్టి  మమ్మల్ని ఏంచేద్దాం అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకీ మాకేమన్నా అయితే మీదే బాధ్యత. 45 డిగ్రీల ఉష్ణగ్రత ఉంది. ఎందుకు ఇట్లా బాగా వేధిస్తున్నారు. అర్థం కావడం లేదని తమ బాధను అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఇన్ని సంవత్సరాలు చేయని ఉద్యోగాలు ఇప్పుడే చేస్తున్నామా,అర్జెంటు అర్జెంట్ అని ప్రాణాలు పోయేటట్టు చేస్తున్నారు. టీచర్లు ప్రాణాలకంటే మీటింగులు ఎక్కువనా…అని అంగన్వాడీ టీచర్లు తమ బాధలను చెపుతున్నారు.
సూపర్ వైజర్లు వేదిస్తున్నారు
కొందరు సూపర్ వైజర్లు అంగన్వాడి టీచర్లని కనీసం వయసు కూడా లెక్కచేయకుండా తీసి పడేసినట్లు మాట్లాడడం అవహేళనగా మాట్లాడడం తను ఇష్టానుసారంగా వ్యవహరించడం మా మనోభావాలను దెబ్బతీయడం మేము భరించలేక పోతున్నామని అంటున్నారు.ఎంతవర్కు చేసిన ఫలితం దక్కడం లేదు. ఇదిచాలా బాధాకరం ప్రతిఅంగన్వాడి టీచర్లు నుండి ప్రతి ఒక్క రిపోర్ట్ పోతూనే ఉంది. మమ్మల్ని బెదిరించి,ఇబ్బంది పెట్టి  లెక్కచేయకుండా, గౌరవం లేకుండా ప్రవర్తించడం ఇది ఎంతవరకు  సమంజసం అని ప్రశ్నస్తున్నారు.ఇబ్బంది పెడుతున్న సూపర్వైజర్ మార్చాలని కోరుతున్నారు.
వేసవిలో పని భారం పెంచారు
మండు వేసవిలో మాకు పని భారం పెంచారు. గ్యాస్ బిల్లులు వేయక రెండేళ్లు, టీఏ, డీఏ లు రాక 10 ఏళ్ళు, రికార్డులు ఇవ్వక మూడేళ్లు, వేతనాలు ఇవ్వక రెండునెల్లు అయినా పనిచేస్తన్నప్పటికి సూపర్ వైజర్లు మమ్మల్ని వేదిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల మై ఉండి మాకు కొంచెమైనా గౌరవం ఇవ్వడం లేదు. ఎలా పడితే ఆలా మాట్లాడు తున్నారు. ఈ నెలలో ఏ టీచర్ కు ఏదైనా జరిగితే అక్కడి ఆఫీస్ స్టాఫ్ వాళ్ళే బాధ్యత వహించాలి.. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సీఐటీ యు జిల్లా అధ్యక్షురాలు, అంబటి మణెమ్మ..
Spread the love