Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బట్టుగూడెంలో మెరిసిన ఆణిముత్యం

బట్టుగూడెంలో మెరిసిన ఆణిముత్యం

- Advertisement -
  • హ్యాండ్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక..
    నవతెలంగాణ – పెద్దవూర

    తల్లి,తండ్రి గురువుల ప్రోత్సాహం దానికి తగిన కృషి,పట్టుదలతో జూనియర్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు  ఏంపిక అయింది. కుతాటి స్టాలిన్ బేబీ.పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన కూతటి రాములు- వెంకటమ్మ కుమార్తె కూతటి స్టాలిన్ బేబీ జూనియర్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ నెల 4 నుండి 6 వరకు మంగళపల్లి లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చడం తో ఈ నెల 18 నుండి 23 వరకు బీహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లాలో జరిగే 47వ జూనియర్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కావడం విశేషం. ఈ ఎంపిక పట్ల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు క్రీడాకారుని స్టాలిన్ బేబీని అభినందించారు. జూనియర్ హ్యాండ్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో విజేత గా మెడల్ తో తిరిగి వచ్చి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కల సాకారం చేస్తానని కుతాటి స్థాలిన్ బేబీ చేప్పారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -