గుంతల మయంగా రోడ్డు..

– పట్టించుకోని అధికారులు – ఇబ్బందుల్లో ప్రయాణికులు
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల పట్టణంలోని రెండవ రైల్వే గేట్‌ దాటిన కొద్ది దూరంలో ప్రధాన రోడ్డుపై ఒక సంవత్సరం కాలం నుంచి పెద్ద గుంత ఏర్పడి వాహన దారులతో పాటు పాదచారులకు ఇబ్బంది కలుగుతుంది. దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి ఈ గుంత అదేవిధంగా ఉండడంతో వర్షా కాలంతో పాటు మిగతా రోజులలో నీరు నిల్వ చేరడంతో వాహనదారులు, పాదాచారులు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే ఆ పెద్ద గుంతలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఎక్కడ ఎంత పెద్ద గుంత ఉందో తెలియక వాహన దారులు తీవ్ర ఇబ్బం దులకు గురవు తున్నారు. పలు సందర్భాలలో కాలనీ వాసులు, వాహనదారులు ఆ గుంతలో పడి గాయాల పాలైన సంఘటనలు లేకపో లేదు. సంబంధిత అధికారులు స్పందించి అట్టి గుంతను పూడ్చి వాహన దారులు, పాదాచారులు, కాలనీవాసుల ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Spread the love