- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో.. కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరంగల్ లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయనపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 308 (2), 308 (4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఉదయం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.
- Advertisement -