Wednesday, August 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమాజీ ఎంపీ పి.మధు సతీమణి ఐద్వానేత సుమతి మృతి

మాజీ ఎంపీ పి.మధు సతీమణి ఐద్వానేత సుమతి మృతి

- Advertisement -

మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
ఉద్యోగం చేస్తూనే కమ్యూనిస్టు ఉద్యమానికి బాసట
సీపీఐ(ఎం) విస్తరణకు ఎనలేని కృషి
ఆమె ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు
పనిచేయాలి :పొలిట్‌‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
పింఛన్‌‌ను కూడా పార్టీకి విరాళంగా అందించారు : సీపీఐ(ఎం)
తెలంగాణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు జాన్‌‌వెస్లీ, వి. శ్రీనివాసరావు

నవతెలంగాణ – 
మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) సీనియర్‌‌నేత, మాజీ రాజ్యసభ సభ్యులు పి. మధు భార్య ఐద్వా నాయకులు సుమతీ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సుశ్రుత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సీపీఐ(ఎం) జాతీయ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర నాయకులు, పార్టీ శ్రేణులు, ఐద్వా నేతలు ఘన నివాళులర్పించారు. మృతదేహాన్ని మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు పరిశోధనల నిమిత్తం కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ ఇంగ్లీష్, తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం కల్గిన సుమతీ అనేక రచనలు చేశార న్నారు. చనిపోయే నాటికి సామాజిక సృహకల్గిన కథనాలు అనేకం రచించారని తెలిపారు. ఉద్యోగం చేస్తూనే ఆమె సీపీఐ(ఎం) బలోపేతం కోసం సలహాలు, సూచనలు చేసేవారన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే పింఛన్‌‌లో తెలంగాణకు రూ. 50 వేలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 50 వేలను ప్రతి నెలా విరాళంగా ఇస్తున్నారంటే ఆమె ఉదారత్వం ఏమిటో తెలుస్తోందన్నారు.

ఉద్యోగ సమయంలో జనవిజ్ఞాన వేదికలో పనిచేస్తూ…మూఢనమ్మకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారన్నారు. శాస్త్రీయ భావ జాలం పెంపుదల కోసం ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ఐద్వాలో చేరి మహిళాభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. మధు కుటుంబం మొత్తం సీపీఐ(ఎం)లో ఉంటూ…కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం అభినందనీ యన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మధు చేసిన కృషి వల్లే నేడు పార్టీ నిలబడిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీపీఐ(ఎం) బలోపేతం కోసం కృషి చేసిన వారిలో సుమతీ ఒకరన్నారు. ఆమె బాటలోనే నడుస్తూ.. సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయడమే ఆమెకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే వెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, నున్నా నాగేశ్వరరావు, ఏపీ నాయకులు వై. వెంకటేశ్వర్‌‌ రావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్, వ్మవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్‌ రావు వ్యకాస రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌. వెంకట్‌రాములు, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు రాంమోహన్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షులు మల్లు లక్ష్మి, అరుణజ్యోతి, ఉపాధ్యక్ష‍లు అశాలత, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైల బాబు ప్రముఖ న్యాయవాది బేక్యం జనార్ధన్, పాలమూరు ఐద్యావేదిక అధ్యక్షులు నాయకులు రాఘవ చారి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాభాస్కర్, ఉమ్మడి పాలమూరు జిల్లాల సీపీఐ(ఎం) కార్యదర్శులు రాములు, పర్వతాలు, పుట్ట అంజనే యులు ,వెంకట్‌రామిరెడ్డి, వెంకట్‌స్వామి, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కిల్లె గోపాల్‌, ప్రజా సంఘాల నాయకులు, రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌నాయకులు, తదితరులు పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -