Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : చదివి, రాయడంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించి ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుందని  ప్రధాన ఉపాధ్యాయుడు లాక్యనాయక్ పేర్కొన్నారు. శనివారం రోజున మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలోఉపాధ్యాయులు, విద్యార్థులు ముందస్తుగా యోగాదినోత్సవాన్నినిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠగాల ప్రధాన ఉపాధ్యాయులు లాక్యమాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటారని యోగా అనేది ఒక్కరోజు చేస్తే సరిపోదని నిత్యం యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు.ప్రాచీన భారతీయ సంప్రదాయం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి యోగా.ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా,మానసిక శ్రేయస్సుకూ తోడ్పడుతుందని అన్నారు.యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయిని,స్రవంతి,సారిక,ఉపాధ్యాయులు క్రాంతి,రమేష్,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -