
కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామానికి చెందిన ముండ్రాయి సందీప్ (38) అన్న యువ రైతు తన పంట పొలం వద్ద విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురయ్యాడు. వెంటనే తన సోదరుడు హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య రమ్య ఇద్దరు కుమారులు ఉన్నారు. యువరైతు మృతి చెందడంతో
గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతి చెందిన యువ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.