గాలివానకు విరిగిన స్తంభాలు..

– పట్టించుకోని విద్యుత్ అధికారులు..
– బకాయిలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా..
నవతెలంగాణ – కొనరావుపేట 
గాలివానకు విరిగిన స్తంభాలను సరి చేయమని రైతులు అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదు మండలంలోని మరిమడ్ల గ్రామాలలో బైరి మల్లేశం అనే రైతు పంట పొలంలో గత నెలలో కురిసిన వర్షాలకు, ఈదురు గాలులకు పంట పొలంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి నేలమట్టమయ్యాయి. విరిగి పడిన స్తంభాలకు మరమ్మత్తులు చేసేందుకు చెస్ విద్యుత్ అధికారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ అధికారికి పల్లు మార్లు చెప్పిన  పట్టించుకోవడంలేదని ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వరి నార్లు పోసేందుకు పంట పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను అమర్చక, విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. విద్యుత్ అధికారులకు పలుమార్లు తెలియజేసిన పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అధికంగా కురిస్తే విద్యుత్ స్తంభాల మరమ్మతుకు అవకాశం ఉండదని, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కొత్త స్తంభాలకు మరమ్మత్తులు చేయాలని రైతులు కోరుతున్నారు.
Spread the love