– వరల్డ్ అథ్లెటిక్స్ మీట్
జెనీవా : ప్రపంచ అథ్లెటిక్స్ మీట్‌లో భారత అథ్లెట్ సిల్వర్ మెడల్ సాధించాడు. పురుషుల 110 మీటర్ల హార్డిల్స్‌లో తేజస్ శిర్సె సత్తా చాటాడు. 21 ఏండ్ల తేజస్ ఈ విభాగంలో 13.60 సెకండ్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. కొలంబియా అథ్లెట్ 13.49 సెకండ్లతో పసిడి పతకం సాధించాడు. మహిళల లాంగ్‌జంప్‌లో శాలిని సింగ్ నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది.