Wednesday, June 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళలకు గుడ్ న్యూస్.. భారీ స్థాయిలో రుణాలు మంజూరు

మహిళలకు గుడ్ న్యూస్.. భారీ స్థాయిలో రుణాలు మంజూరు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళలకు బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేసింది. దీని వల్ల చాలా మంది మహిళలకు ఊరట లభించిందని అనుకోవచ్చు. ఇంతకు అది ఏ బ్యాంక్? ఎంత మొత్తాన్ని రుణాల రూపంలో విడుదల చేసింది? అనే అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. స్వయం సహాయక బృందాల (SHGs) సాధికారతను ప్రోత్సహించే దిశగా ఇండియన్ బ్యాంక్‌ భారీ స్థాయిలో ఆర్థిక మద్దతును అందించింది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిలో ఏర్పాటు చేసిన మెగా స్వయం సహాయక సంఘాల క్రెడిట్ ఔట్‌రిచ్ క్యాంపుల ద్వారా మొత్తం రూ.1,050 కోట్ల రుణాలను మంజూరు చేసింది.

హైదరాబాద్‌ క్యాంపుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నేతృత్వం – హైదరాబాద్‌లో జరిగిన ఔట్‌రిచ్‌ శిబిరానికి ఇండియన్ బ్యాంక్‌ చెన్నై కార్పొరేట్ కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ శ్రీ శివ్ బజరంగ్ సింగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, స్వయం సహాయక సంఘాల సభ్యులు 100 శాతం రుణ చెల్లింపులు జరిపినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళల సాధికారతపై బ్యాంక్‌ దృష్టి పెట్టిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో సేవలు అందుబాటులో ఉండటం, సమ్మిళిత అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాల పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. మహిళల నాయకత్వాన్ని మెరుగుపరిచేలా సులభరీతిలో రుణాల మంజూరు, సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలు వంటి చర్యల ద్వారా ఇండియన్ బ్యాంక్ తన నిరంతర కట్టుబాటును పునరుద్ఘాటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -