నవతెలంగాణ-హైదరాబాద్ : బంధన్ మ్యూచువల్ ఫండ్ బంధన్ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది టోటల్ మార్కెట్ ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఓపెన్ ఎండ్ ఇండెక్స్ స్కీమ్. భారతీయ ఈక్విటీ మార్కెట్లో 95 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న లార్జ్, మిడ్, స్మాల్, మైక్రో క్యాప్స్‌లో 750 స్టాక్లను కలిగి ఉన్న విభిన్నమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఈ ఫండ్ పెట్టుబడిదారులకు కల్పిస్తుంది. కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) సోమవారం, 24 జూన్ 2024న తెరవబడుతుంది. శుక్రవారం, 5 జూలై 2024న ముగుస్తుంది. బంధన్ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడిని లైసెన్స్ పొందిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, నేరుగా httpsలో