యువతను పాలక ప్రభుత్వాలు ఆదుకోవాలి : గడ్డం వెంకటేష్ 

– స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి….
– డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రామాలలో అనేక మంది యువత ఉపాధి లేక ఉద్యోగాలు లేక ప్రభుత్వాలు ఉద్యోగాల నోటిఫికేషన్ వేయక ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని, వారిని వెంటనే ప్రభుత్వాలు ఆదుకొని స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువజన సర్వే నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చదువుకున్న నిరుద్యోగ యువతకు నిరాశ మిగిలిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువత పట్ల ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ ఉపాధి కానీ ప్రకటించిన పరిస్థితి లేదని వారు అన్నారు. మార్పు రావాలి అనే పేరుతో యువత కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తే వారి పట్ల కనీసం చిత్తశుద్ధి లేకుండా పరిపాలన సాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి యువతకు భరోసా ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు.  బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాట ఊసే లేకుండా పోయిందని, ప్రధానమంత్రి గ్రామీణ వికాస్ యోజన, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టిన యువతకు ఎలాంటి ఉపాధి లేదని బిజెపి పాలనలో యువతకు మొండి చేయ మిగిలిందని వారు అన్నారు. తాళ్లకాలంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎద్దుల పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పల్లెర్ల అంజయ్య, ఆంజనేయులు యువత పవన్, చందు, వెంకటేష్, నందు లు పాల్గొన్నారు.
Spread the love