
నిన్న హైదరాబాద్ రవీంద్రభారతిలో సెమ్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం విశ్వ భారతి విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయి రాష్ట్రస్థాయి బహుమతులు అందుకున్నారు. సేమ్స్ కన్వీనర్ అరకాల రామచంద్రారెడ్డి, కో కన్వీనర్ ఎస్ ఎన్ రెడ్డి, నటులు కే.వి ప్రదీప్ చేతులమీదుగా జే వెంకట నారాయణ 8వ, నేషనల్ ఫస్ట్ ఎం అక్షయ 8వ సెకండ్, వివేష్ 5వ స్టేట్ ఫస్ట్, అమ్రిన్ 7వ స్టేట్ సెకండ్, పులి నిక్షిప్త 8వ స్టేట్ థర్డ్ , నూరుద్దీన్ 3వ స్టేట్ సెకండ్, అలీజా 3వ స్టేట్ థర్డ్, సారా ఫాతిమా 4వ స్టేట్ థర్డ్, సహిస్తా మహావీన్ 9వ స్టేట్ 8th ర్యాంకులు సాధించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. లక్షల మంది జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో పరీక్షలు రాసిన విద్యార్థులలో మన రామగుండం విద్యార్థులు ర్యాంకులు సాధించి బహుమతులు పొందడం పట్ల విశ్వ భారతి విద్యాసంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, హెడ్మాస్టర్ తిరుపతి గౌడ్ నోయల్ జోసెఫ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులను, ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ విశ్వభారతి, నవోదయ, సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థలు ముందంజలో ఉంటున్నాయని తెలిపారు.