Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు కాంగ్రెస్ సన్నాహక సమీక్షా సమావేశం

రేపు కాంగ్రెస్ సన్నాహక సమీక్షా సమావేశం

- Advertisement -

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
: శుక్రవారం తాడిచర్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమీక్షా సమావేశం ఉంటుందని కాంగ్రెస్ మడలాధ్యక్షులు బడితేల స్వరపా రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అబ్జర్వర్ లింగాజి లు పాల్గొననున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల యూత్, మహిళ, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -