Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు ఒక కేసులో కీలకమైన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి, తప్పడం మోసం కావచ్చేమో గానీ.. నేరంగా భావించే మోసం కాదు అని తెలిపింది. అంటే.. ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే, అలాంటి వ్యక్తిపై చట్టపరంగా ఎలాంటి చర్యలూ ఉండవు. ఐతే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే.. మోసం చేయాలనే ఉద్దేశం ఉంది అని తేలితే.. అది నేరమే అవుతుంది. అది నిరూపించాల్సిన బాధ్యత బాధితులకు ఉంటుంది. అంటే స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అప్పుడే దాన్ని నేరంగా పరిగణిస్తారు. కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం ఓ కేసు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన రాజాపురం జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారిస్తూ.. కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2019లో కరకల్ల పద్మిని రెడ్డి, జీవన్ రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -