Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంతానం లేని వారికి వరం ఐవిఎఫ్, ఐయూఐ 

సంతానం లేని వారికి వరం ఐవిఎఫ్, ఐయూఐ 

- Advertisement -

నవతెలంగాణ – కంటేశ్వర్ : ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఐ వి ఎఫ్ ఎవరికి అవసరం, ఎలా ఉండాలి అనే అంశాలపై సవివరంగా ఎంబిబిఎస్, ఎండి (ఏఐఐఎంఎస్, న్యూఢిల్లీ) ఎఫ్ఆర్ఎం, మినీ మల్లి ఇన్వేసివ్, గైనకాలజీ, డాక్టర్ అర్చన వివరించారు. సంతానం ఓ సౌభాగ్యం. మాతృత్వం ఓ మాధుర్యం. అయితే అనేక జంటలు పెళ్లయి ఏళ్లు గడిచినా గర్భం ధరించలేక బాధపడుతున్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందించిన ఓ వరం ఐవిఎఫ్/ఐయూఐ. ఎన్నో ఏళ్లుగా సంతాన లేమితో బాధపడే వారికి ఐవీఎఫ్ ఒక వెలుగును చూపిస్తుంది. 

ఐ వి ఎఫ్ అంటే ఏమిటి..?

ఐ వి ఎఫ్ అనగా శరీరం వెలుపల గర్భధారణ. ఇది ఒక ఆధునిక చికిత్స విధానం. ఇందులో మహిళ నుంచి అండాన్ని, పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి ల్యాబ్లో ఫలదీకరణ చేసి ఏర్పడిన ఎంబ్రియోని గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 

ఐవిఎఫ్ ఎవరికి అవసరం…?

పదేళ్లకు పైగా గర్భం రాని జంటలకు, 
ట్యూబ్ బ్లాకేజ్, పి సి ఓ ఎన్, ఎండోమెట్రీయేసిస్,
పురుషుల్లో తక్కువ స్పెర్ము కౌంట్, 
వయస్సు పెరిగిన మహిళలు 35 ఏళ్ల పైగా, 
గతంలో ఇతర చికిత్సలు విఫలమైన వారు 


మానసిక ఒత్తిడిని తేలికగా తీసుకోవాలి..?

ఇది కేవలం శరీర వైద్యం కాదు. భావోద్వేగ ప్రయాణం. జంటలకు కౌన్సిలింగ్ సహాయంతోపాటు మనోధైర్యం అత్యంత అవసరం. మానసిక ఆరోగ్యం ఐవీఎఫ్ విజయానికి ఒక కీలక భాగం. 

చివరగా..

ఐవిఎఫ్ అనేది చివరి అవకాశం కాదు. కొత్త జీవితం కోసం మొదటి మెట్టు, మీ కలను సహకారం చేసే ఈ ప్రయాణంతో నమ్మదగిన వైద్యుడిని సంప్రదించి, వారి సహాయంతో ముందుకు అడుగు వేయండి. పసి పిల్లల చిరునవ్వుతో మీ కుటుంబాన్ని పరిపూర్ణంగా మార్చుకోండి.

పినాకిల్ ఫర్టిలిటీ యొక్క ప్రత్యేకత….?

ప్రతి జంటను వారి తమ గామెట్స్ తోనే చికిత్స జరుగుతుంది. వీర్యం లేదా అండాలు మరొకరితో మిక్స్ చేయబడవు. ప్రతి దశలో సిసి టీవీ పర్యవేక్షణ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆచార నైతికత, జన్యుపరమైన హక్కుల రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ తో సక్సెస్ 50 నుండి 60 శాతం ఉండగా.. తమ వద్ద విప్లవత్మకంగా 80 శాతం సక్సెస్ రేట్ తో ప్రతి నెల సాధించగలుగుతున్నాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఐవిఎఫ్ ఫెయిల్యూర్ పునరావృత కేసులను చాలెంజ్ గా తీసుకొని, ఫెయిల్యూర్ కేసులలో కూడా అత్యధిక సక్సెస్ రేట్ ఇవ్వడం మా ప్రత్యేకత.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -