
మండలంలోని పార్డి బి గ్రామంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా సప్తమి వేడుకలు శనివారం శ్రీరాజరాజేశ్వర మందిరంలో ఆయాల పూజారి దత్తత్రి మహరాజ్ చే రాజరాజేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్తమి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షడు వి మోహన్ మాట్లాడుతూ పార్డి బి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరుని ఆలయంలో పురాతన కాలంనుంచి అనవహితిగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటి వరకు ఆచారాన్ని కొనసాగించి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈవేడుకలు వారం రోజుల పాటు కొనసాగి ప్రతి రోజు ఆర్య వైశులు అన్నదాన కార్యక్రమాలు చేసి చివరి రోజున గ్రామస్తులు అందరూ కలసి కృషుడి వేషధారణలో ఉట్టి కొట్టే కార్యక్రమాలు చేపట్టి ముంగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈకార్యక్రమంలో గ్రామస్తులు చిమ్మన పోశెట్టి శేరి సురేష్,బాబు,బిజ్జమ్ సంతోష్,అవుసలి లింబద్రి, స్వామి ,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.