
మండలంలోని బొమ్మకల్ గ్రామ కార్యదర్శి గా గత ఐదేళ్లుగా విధులు నిర్వహించి, ఇటీవల బదిలీపై పెద్దవంగరకు వెళ్లిన నరేష్ ను సోమవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గ్రామస్తులు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు పొడిశెట్టి శారదా సైదులు గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు పసులేటి వెంకట్రామయ్య, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డెబోయిన గంగాధర్, గిరగాని ఐలయ్య, కారోబార్ గిరగాని రామస్వామి, సీఆర్పీ రంగన్న తదితరులు పాల్గొన్నారు.