హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో ఎంఐసి ఎలక్ట్రానిక్స్ నికర అమ్మకాలు 52.93 శాతం పెరిగి రూ.10.71 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7.02 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1.24 కోట్లుగా ఉన్న నికర లాభాలు.. గడిచిన క్యూ1లో 58.48 శాతం పెరిగి రూ.1.97 కోట్లకు చేరాయి. గడిచిన ఆరు మాసాల్లో ఈ కంపెనీ షేర్ 137 శాతం మేర పెరిగింది.