
డెంగ్యూ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ తులసీరామ్ అన్నారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో డెంగ్యూ నివారణ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలోని కాలనీలలో ఇంటింటి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యం ఎవరైనా చలి జ్వరం వారం రోజుల నుండి బాధపడుతున్నట్లు ఉంటే వెంటనే ఆశా కార్యకర్తలకు లేదా ఆరోగ్య కేంద్రాన్నికి రావాలన్నారు డెంగ్యూ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చికిత్సలు జరిగే విధంగా చూడడం జరుగుతుంది అన్నారు. ఇంటి పరిసరాల్లో మురికి నీరు వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంపీడీవో మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగన్న, ఏఎన్ఎం లక్ష్మి, తదితరులు ఉన్నారు.