
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. మండలంలోని కప్పర్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కమ్యూనిటీ సహకారంతో మరింత పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తిథి(సామూహిక) భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కప్పర్ల మాజీ ఎంపీటీసీ కౌడల సంతోష్,మాజీ సర్పంచ్ కౌడల నారాయణ అన్నారు. మంగళవారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్థానిక యువ నాయకులు గండ్రత్ అరుణ్ తన వంతుగా 5 వేల రూపాయలతో అందజేసిన తిథి(సామూహిక)భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు,ఉపాధ్యాయులకు భోజనం వడ్డించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు గండ్రత్ అరుణ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్,ఉపాధ్యాయులు కిష్టన్న,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.