న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని బలపరిచిన తీర్పు

A judgment that strengthened social justice in the legal systemనవతెలంగాణ – రామకృష్ణాపూర్
న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని బలపరిచిన దశాబ్దాల తరబడి వింత వివక్షకు గురై ఆవేదనపడిన జాతికి గురువారం వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని బలపరచిన తీర్పు  వెలువడిందని తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది  రాజలింగు మోతె అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిగ, మాదిగ ఉప కులాల మునుగడకు ప్రాణం పోసే తీర్పు అని అన్నారు. ఈ తీర్పు ద్వారా  విద్యా,ఉద్యోగ,సంక్షేమ రాజకీయ అవకాశాలు పొందవచ్చన్నారు. భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ భావాజాలం పట్ల గౌరవం ఉన్న బలహీనవర్గాల ప్రజలందరితో పాటు  కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ  ఈ తీర్పును గౌరవించాలని, సహృదయంతో స్వాగతించాలని ఆయన కోరారు.
Spread the love