- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: ఈ నెల 4వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య(లేట్) జయంతి వేడుకలను నిర్వహించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు జూలై 4న ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అధికారులు సిబ్బంది తప్పనిసరిగా హాజరై, విజయవంతం చేయవలసిందిగా కోరారు.
- Advertisement -