హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అయిన రాయల్ఓక్ ఫర్నిచర్ తమ స్టోర్‌లో బిగ్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. 10,000 పైగా ఫర్నీచర్, గృహాలంకరణ వస్తువులపై 31 ఆగస్టు 2024 వరకు ప్రత్యేకమైన బిగ్ ఫ్రీడమ్ సేల్‌ను కూడా పరిచయం చేస్తోంది. రూ.75,000కు పైగా షాపింగ్ చేసే కస్టమర్లు పలు ఉచిత ఫర్నీచర్ వస్తువులను పొందవచ్చని పేర్కొంది. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన కరీంనగర్‌లోని తమ స్టోర్‌లోనూ అసాధారణమైన ఫర్నీచర్ డిజైన్లు లభ్యమవుతాయని తెలిపింది.