జన్నారం మండలం మహ్మదాబాద్ గ్రామానికిచెందిన దుర్గం వినోద్ కుమార్ కు యోగా రత్న అవార్డు దక్కింది. హైద రాబాద్ లో సరూర్నగర్ జ్యోతి క్లబ్ లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లాస్థాయి యోగా పోటీల్లో భాగంగా యోగాలో సేవలు అందిస్తున్న వినోద్ కుమార్ కు తెలంగాణ యోగా అసోసియేషన్ కార్యదర్శి జే మనోహర్ ఆధ్వర్యంలో అవార్డును అందజేశారు.సందర్భంగా వినోద్ కుమార్ ను, తెలంగాణ మహర్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత, జన్నారం జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ఎంపీపీ మాదాడి సరోజన రవీందర్రావు, సర్పంచుల సంఘంమాజీ మండల అధ్యక్షుడు జాడి గంగాధర్, నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్, జన్నారం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్, తదితరులు అభినందించారు.