ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

MLA visited the government hospitalనవతెలంగాణ – మద్నూర్ 
ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు,మౌలిక సదుపాయాలు తదితర వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని సమస్యలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకురాగా.. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కావాల్సిన మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే బడ్జెట్ లో వైద్య ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఆస్పత్రి సందర్శన కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఆనంద్ జాదవ్ ఇతర వైద్యులు వైద్య సిబ్బంది అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love