చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ..

నవతెలంగాణ – జన్నారం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిరు వ్యాపారులకు సోమవారం రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ గొడుగులను పంపిణీ చేశారు. రోడ్ల పక్కన కూర్చుని తోటల్లో పెంచిన కూరగాయలను అమ్ముకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులందరికీ గొడుగులను పంపిణీ చేయడం జరిగిందని ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడం తన ధర్మం అని రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్, తాజా మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు తిరుపతి, సదాశివ, రాహూల్ లు పాల్గొన్నారు.

Spread the love