Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంలిబరల్‌ పార్టీ ఘన విజయం..కెనడా ప్ర‌ధానిగా మార్క్‌ కార్నీ

లిబరల్‌ పార్టీ ఘన విజయం..కెనడా ప్ర‌ధానిగా మార్క్‌ కార్నీ

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: కెనడా ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ దేశ చరిత్రలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా లిబరల్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ కంటే.. లిబరల్‌ పార్టీనే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అయితే పార్లమెంటు 343 సీట్లలో లిబరల్‌ పార్టీ, కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుందన్నది వివరాలు వెల్లడికాలేదు. ఈ ఎన్నికల ఫలితాల్లో కెనడా ప్రజలు లిబరల్‌ పార్టీకే పట్టం కట్టడంతో.. ప్రధానిగా మార్క్‌ కార్నీనే మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే సోషల్‌మీడియాలో కార్నీకి అభినందనలు వెల్లువెతుత్తన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img