మత్తు పదార్థాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రవి 

Youth should be vigilant about drugs: Essie Raviనవతెలంగాణ – శంకరపట్నం
సైబర్ క్రైమ్,మాదకద్రవ్యాల వినియోగం పట్ల విద్యార్థులు, యువత, అప్రమత్తంగా ఉండాలిని స్థానిక ఎస్సై కొత్తపల్లి రవి అన్నారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని మొలంగూర్ బస్టాండ్ దగ్గర అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ,మద్యం గంజాయి మత్తు ఇంజక్షన్లు, డ్రగ్స్ బారిన పడవద్దని ఆయన హెచ్చరించారు. వీటిని తీసుకోవడం వలన చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నట్లని ఆయన అన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసే వారికి 20 సంవత్సరాల జైలు శిక్ష 2 లక్షల రూపాయల జరిమానా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love