- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆ సంఘం నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో కృష్ణయ్యతో పాటు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఈరవత్రి అనిల్ తదితరులున్నారు.
- Advertisement -