ఇందిరమ్మ కమిటీలలో మైనార్టీలకు మొండి చెయ్యి

Stubborn to minorities in Indiramma committees– మైనారిటీ జిల్లా అధ్యక్షుడు  యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నియమించిన ఇందిరమ్మ కమిటీలల్లో మైనారిటీలకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా గురువారం నాడు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో 5 లక్షల రూపాయలు అందిస్తున్నందున లబ్దిదారులను ఎంపిక చెయ్యటానికి గాను, ఏర్పాటు చేయనున్న కమిటీలలో సభ్యులుగా మైనారిటీలను నియమించకుండా అన్యాయం చేసారని అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ సలహాదారులుగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ సహితం ఈ విషయంలో మౌనం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇందిరమ్మ కమిటీలలో సభ్యులుగా మైనారిటీలు లేని కారణంగా నిరుపేద మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మైనారిటీ ఓటు బ్యాంకుతో రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఇందిరమ్మ కమిటీలు వెయ్యడానికి విడుదల చేసిన జీఓ నంబర్.33ను సవరించి మైనారిటీలకు అవకాశం కల్పించాలని కోరారు.
Spread the love