- Advertisement -
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి హీరోయిన్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ నిర్మిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శనివారం హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ ఇవ్వనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- Advertisement -