- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం కల్పించాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు సంతోష్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళ వారం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొదటిరోజు వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ లో గల ఈదమ్మ బండ తండా , చల్లపల్లి , బొల్లంపల్లి ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర కమిటీకి నివేదిక అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
- Advertisement -