- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర : మండల కేంద్రానికి చెందిన చిలుక వెంకటమ్మ (82), చిలుక తిమోతి (50) వేరువేరు కారణాలతో ఇటీవల మృతి చెందారు. ఆదివారం బాధిత కుటుంబాలకు గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దసాని హరి వేరువేరుగా 50 కిలోల బియ్యం అందజేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు సుంకరి ఓంకార్, చిలుక సంపత్, చెరుకు యాకయ్య, కాంగ్రెస్ యూత్ నాయకులు జలగం రాజశేఖర్, సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



