Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శభాష్ నగర్ లో ఘనంగా బేతాళుని విగ్రహప్రతిష్టాపన.!

శభాష్ నగర్ లో ఘనంగా బేతాళుని విగ్రహప్రతిష్టాపన.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలం ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల శభాష్ నగర్ లో శ్రీ బేతాళుని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్నీ ఆదివారం అంగరంవైభవంగా నిర్వహించారు.ఈ మహోత్సవ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలు సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని,పాడిపంటలు బాగా పండాలని,వర్షాలు సంవృద్దిగా కురావలని బేతాళున్నీ వేడుకొన్నారు.తన వంతు సాయంగా సర్పంచ్ రూ.5 వేల విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్,ఎడ్లపల్లి గ్రామ వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -