నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలం ఎడ్లపల్లి గ్రామపరిదిలోగల అటవీప్రాంతంలో ఉన్న చిన్నతరహా బొగ్గులవాగు ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటల కోసం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్,కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నీరు వృదాచేయకుండా ఒడిసిపట్టి పొదుపుగా వాడుకోవాలని సూచించారు.ప్రాజెక్టు నీటితో ఎడ్లపల్లి,రుద్రారం, కొయ్యుర్,శభాష్ నగర్,జంగిడిపల్లి,కొండంపేట తదితర గ్రామాల్లోని దాదాపు ఐదువేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.ప్రాజెక్టు సామర్ధ్యత రెండు టీఎంసిలు కాగా ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో తక్కువగా నీరు చేరిందన్నారు.రైతుల నారుమడులు ఎండిపోతున్న నేపథ్యంలో నీటిని విడుదల చేసినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి,లక్ష్మిరాజు,మేరుగు శ్రీనివాస్,లావుడ్య రవీందర్,తొగరి శంకర్,అజ్మీర శివ,ధబ్బెట,అక్కినవేనిసమ్మయ్య,లావుడ్య సారయ్య,సత్యం,ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
బొగ్గుల వాగు ప్రాజెక్టు నీటి విడుదల.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


