రూ. 19,71,800కి సెలక్ట్ ప్రో 1.5లీ సివిటి పెట్రోల్ లో హెక్టార్ ప్లస్ 7-సీటర్ విడుదల చేసింది మరియు స్మార్ట్ ప్రో 2.0 లీ డిఎస్ఎల్ 6 ఎంటి రూ. 20,64,800కి లభిస్తోంది
-
వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో భారతదేశపు అతి పెద్ద 35.56 సెంమీ (14 అంగుళాలు) హెచ్ డి పోర్ట్ రైట్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ\
-
ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో మనోహరమైన సన్ రూఫ్, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడి బ్లేడ్ కనక్టెడ్ టైల్ ల్యాంప్స్
-
స్మార్ట్ కీ మరియు డిజిటల్ బ్లూటూత్ కీ మరియు కీ షేరింగ్ సామర్థ్యంతో పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ కీ
-
75 కనక్టెడ్ కార్ ఫీచర్లతో పరిశ్రమలో ఉత్తమమైన i-SMART టెక్నాలజీ
-
ABS, EBD, ESP, TCS, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు గలది
నవతెలంగాణ గురుగ్రామ్: జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా రెండు కొత్త 7-సీటర్ వేరియెంట్స్ హెక్టర్ ప్లస్ 7-సీటర్ సెలక్ట్ ప్రో మరియు స్మార్ట్ ప్రో ను చేర్చి భారతదేశపు మొదటి ఇంటర్నెట్ ఎస్ యువి ఎంజి హెక్టర్ శ్రేణి విస్తరణను ప్రకటించింది. ప్రీమియం ఎస్ యువి అనుభవాన్ని కోరుకునే కస్టమర్ల కోసం విశాలమైన మరియు విలక్షణమైన ఆప్షన్ ను ఇది అందిస్తోంది. సివిటి ట్రాన్స్ మిషన్ తో జత కలిసిన 1.5 టి ప్రెటోల్ ఇంజన్ ద్వారా ద సెలక్ట్ ప్రో మద్దతు చేయబడింది, సాఫీ మరియు సమర్థవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. 2.0 లీ డీజిల్ ఇంజన్ లో లభిస్తోంది. ద స్మార్ట్ ప్రో వేరియెంట్ 6 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ తో ఇంధన సామర్థ్యాన్ని మరియు టార్క్ ను అందిస్తోంది.
“మా కొత్త 7-సీటర్ వేరియెంట్ల చేరిక మా విలువైన కస్టమర్ అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా వారి నిబద్ధతను సూచిస్తోంది. ఎంజి హెక్టర్ విజయం పై ఆధారపడి, ఈ కొత్త చేరికలు నాణ్యత, సౌకర్యం మరియు సాంకేతిక శ్రేష్టతలలో ఎలాంటి రాజీ లేకుండా విశాలమైన మరియు విలక్షణమైన అనుభవాన్ని అందిస్తుండటం హెక్టార్ ను అందరూ ఇష్టపడే ఎంపికను చేసాయి. హెక్టార్ ప్లస్ 7-సీటర్ సెలక్ట్ ప్రో మరియు స్మార్ట్ ప్రోలు ఎస్ యువి ఔత్సాహికుల అంచనాలకు అనుగుణంగా ఉంటాయి మరియు అధిగమించడాన్ని కొనసాగిస్తాయని మేము విశ్వసిస్తున్నాము” అని సతీందర్ సింగ్ బజ్వా అన్నారు.