నేటి బాలలే రేపటి భారత నిర్మాతలు

– సందిబంధంలో ఘనంగా బాలల దినోత్సవం 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మండల పరిధిలోని సందిబంధం గ్రామం ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు బానోత్ భోజ్య నేటి బాలలే రేపటి భారత నిర్మాతలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 14వ తేదీ విద్యార్థులకు ప్రత్యేకమైన రోజని చెప్పారు. చాచా జన్మదినాన పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలో ప్రత్యేకంగా దర్శనమిచ్చి, ఆకట్టుకున్నారని అన్నారు. గురువారం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, రన్నింగ్ పోటీలు, స్కిప్పింగ్, తదితర పోటీలలో అదరహో అనిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బానోత్ రవి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love