నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలో నిర్వహిస్తున్నట్లు ఆ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ కాశపాక మహేందర్ కోరారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సంబంధిత కరపత్రాలను జిల్లా సలహాదారు బట్టు రామచంద్రయ్యతో కలిసి , ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆవిష్కరించి, మాట్లాడారు. కామ్రేడ్ బెల్లి లలిత ఆశయసాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమ శక్తులను ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లిందనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ పదిహేను ఏళ్ళ ఈ ప్రయాణంలో అనేక త్యాగాలు చేసి ప్రజల ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం పోరాడుతూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ద్వితీయ మహాసభలను డిసెంబర్ 14న జరుపుకుంటున్న ఈ మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీడిత ప్రజలు అరవై ఏళ్లుగా నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఆంధ్ర వలస దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు మరోసారి దోపిడీ దొంగల పాలయ్యిందని, ఏ హక్కుల కోసమైతే పోరాడామో అందుకు భిన్నంగా మరింత దోపిడీకి గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని అధికారం పోందిన కేసిఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనంతా నిరంకుశ దోపిడీ పాలనే కోనసాగిందని అన్నారు.అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రశ్నించి పోరాడే ప్రజల హక్కులను కాలరాసిందని భారీ ప్రాజెక్టులు అబివృద్ధి పేర ప్రజలను విస్థాపనకు గరిచేసి కాంట్రాక్టు టెండర్లతో పెట్టుబడిదారులతో చేతులు కలిపి వేలకోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చెసిందని అన్నారు. అందుకే ప్రజల చేతిలో ఓటమిపాలైందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుంది అన్నారు. ఎన్నికల్లో ఏడవ గ్యారంటీగా హామీ ఇచిన ప్రజాస్వామిక హక్కు ను కాలరాసి ప్రజలపై అక్రమ కేసులు పెడుతుందనారు. ప్రజల మౌలిక సమస్యలను పక్కన పెట్టి అబివృద్ధి పేర ప్రజా వ్యతిరేక పాలనే నిండుతుందని అంతిమంగా ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ అయినా అవే దోపిడీ విదానాలు కోనసాగిస్తున్నయి అందుకు వ్యతిరేకంగా ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికై ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు నిరంతరం ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని అన్నారు. ఆ సందర్భంలోనే తెలంగాణ ఉద్యమం నుండి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకై పోరాడుతున్న వేల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ కావాలి యాదయ్య, రాసాల బాలస్వామి, గుండెబోయిన బాలకృష్ణ ,సెక్యులర్ రైటర్ ఫోరమ్ బాధ్యులు షేక్ అమీద్ పాషా, డిటిఎఫ్ బాధ్యులు జి శ్రీనివాసాచారి, చిక్కుల కరుణాకర్, రాసాల నర్సింహ్మా పాల్గొన్నారు.