
కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల రైతు సంఘల ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ జిల్లా నాయకులు వెంకట గౌడ్, ఎఫ్ టి యు జిల్లా నాయకులు ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, ఎఐటియుసి జిల్లా నాయకులు జబ్బార్ లు మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని, కార్పోరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని స్వావలంబనను తాకట్టు పెడుతున్నదని, నిత్యం స్వదేశీ జపం చేస్తూ విదేశీ సంస్థలకు దోచిపెడుతుందన్నారు. మన జాతీయ వనరులను, సంపదలను లూటీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి దూకుడుగా ఉందని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లనును చేయడం, మత ఘర్షణలను లేపుతూ దేశవ్యాప్తంగా ఘర్షణలకు ఊతమిస్తుందని దీని ద్వారా ప్రజలను మతాల వైపు మళ్లించి కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. దీనిపై కార్మిక కర్షగా సంఘాలు చూస్తూ ఊరుకోమని, ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఒకవైపు దేశంలో పేద ప్రజల వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేయకలుస్తుందని కనీసం రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచకుండా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేవలం ప్రచారాలకు, ఆర్భాటాలకు చేసుకుంటూ కంపెనీలకు దోచిపెడుతుందని దీనిపై దేశంలో ఉన్న కార్మికులు, కర్షకులు అందరు ఐక్యంగా పోరాటం చేయాలని మన సంపదను మన హక్కులను చట్టాలను రక్షించుకునేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా నాయకులు నర్సింలు, రాజనర్సు, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు నర్సింలు, రోజా తదితరులు పాల్గొన్నారు.