నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా జరిపిన ఈ దాడిలో గడచిన 24 గంటల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. సుమారు 109 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. సెంట్రల్ గాజాలోని నుసెయిరాట్‌లోని ఓ భవనంపై ఇజ్రాయిల్ బాంబు దాడికి పాల్పడింది. ఈ దాడి వల్ల 8 మంది మృతి చెందారు. ఈ దాడిని నుసెయిరాట్ నివాసితులు భూకంపంగా అభివర్ణించారు. వరుస దాడులతో గాజా వణికిపోతోంది. పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పలుమార్లు ఇజ్రాయిల్‌ని హెచ్చరించినప్పటికీ పాలస్తీనియన్లకు ఆహార సరఫరాను కూడా ఇజ్రాయిల్ నిలిపివేస్తోంది.
- Advertisement -