నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షినటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికల ఆఫిడవిట్‌లో ఓ కేసుకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదనే కారణంతో ఆ రాష్ట్ర ఎన్నికల రిటర్న్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏకపక్ష వైఖరీతో రిటర్నింగ్ అధికారి వ్యవహరించారని, మరోసారి నామినేషన్ పరిశీలించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. మరోవైపు మీనాక్షినటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.
కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



