- Advertisement -
నవతెలంగాణ – తొగుట
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరిత గతిన ప్రారంభించాలని హౌసింగ్ పీడీ దామోదర్ రావు లబ్ది దారుకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మాడల్ భవన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారుల సూచన మేరకే ఇండ్లు నిర్మించుకోవా లని అన్నారు. ఇండ్లు మంజూరైన వారు వెంటనే ఇండ్ల నిర్మాణలు ప్రారంభించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివవాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ పాగల కొండల్ రెడ్డి, బుర్ర నర్సీంలు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -