ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 పరీక్షలు..

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ మండలంలో భిక్కనూరు పట్టణంలోని విజ్ఞాన్ పాఠశాలలో, బిటిఎస్ వద్ద ఉన్న సౌత్ క్యాంపస్, మహాత్మ జ్యోతిబాపూలేలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్ష రాస్తున్న విద్యార్థుల కొరకు వైద్య సిబ్బంది పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. విజ్ఞాన్ పాఠశాలలో 360 మంది విద్యార్థులు గ్రూప్ 4 పరీక్ష రాయగా, 295 మంది విద్యార్థులు హాజరయ్యారు, మిగతా 5 హాజరైనట్లు పరీక్ష కేంద్ర నిర్వాహకులు తెలిపారు.

Spread the love