ఆధునిక దేవాలయాలు నిర్మించిన గొప్ప మనిషి జవహర్ లాల్ నెహ్రూ

– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
ఆధునిక దేవాలయాలు నిర్మించిన గొప్ప మనిషి జవహర్లాల్ నెహ్రు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారము భారతదేశ మొదటి ప్రధాని భారతరత్న స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు ఆయన చిత్రపటానికి మరియు నెహ్రూ పార్క్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నెహ్రూ కి బాలలంటే చాలా ఇష్టం అందుకే నెహ్రూ పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకుంటారని, దేశంలో వంద సంవత్సరాలైనా మర్చిపోనటువంటి అభివృద్ధి మరియు సంస్కరణలను చేసిన మహోన్నత వ్యక్తి నెహ్రూ ని, దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ప్రధాన మంత్రి అయినా నెహ్రూ గారు ఆయనకున్న తెలివితో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ఆలోచనలతో దేశాన్ని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకు నడిపిస్తూ ప్రపంచ స్థాయిలో నిలిపారని ,బిజెపిలోని కొందరు వ్యక్తులు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన నెహ్రూ ని చిన్న చూపు చూస్తూ దేశం కోసం ఏమీ చేయనటువంటి వ్యక్తులను గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు నెహ్రూ గానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు గానీ, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులు దేశం కనుచూపుమేరలో వందల సంవత్సరాలు అయినా అభివృద్ధి పథంలో నడుస్తూ భారతదేశ పౌరుల జీవన గమనాన్ని దృష్టిలో ఉంచుకొని సంస్కరణలు చేశారని, వారు మరణించిన తర్వాత కూడా దేశ ప్రజలు వారిని గుర్తుంచుకుంటున్నారంటే అది కేవలం వారు చేసిన పనుల వల్లనే అని బిజెపి నాయకులు గమనించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. నెహ్రూ ని తక్కువ చేయడం ద్వారా బిజెపి నాయకులు గొప్పవారు కారని నెహ్రూ గారిని తక్కువ చేయడం అంటే ఆకాశం పై ఉమ్మి వేయడమే అని బిజెపి నాయకులు గమనించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ యేతర ప్రధాన మంత్రులు వచ్చినప్పుడు దేశం ఆర్దిక సంక్షోభంలో కూరుకుపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మన్మోహన్ సింగ్ గారు ,పీవీ నరసింహారావు గారు దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం మళ్ళీ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడి పుంజుకుంటుందని ఆయన అన్నారు. నెహ్రూ గారు ఒక గిరిజన బాలికతో ప్రారంభించిన కథనాన్ని నిన్న పత్రికలలో వేశారని, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు చేసిన మంచి పనుల వల్లనే ప్రజలు గుర్తుంచుకుంటున్నారని ,కానీ ఇప్పుడున్న కేసీఆర్, మోడీలు వారి తర్వాత వారి పేరు గుర్తు ఉండాలని చేసిన ప్రతి దానిపై వారి పేర్లను రాసుకుంటున్నారని, కానీ వారు గుర్తుంచుకోవాల్సింది గతంలో ఉన్న ప్రధాన మంత్రులు వారు చేసిన పనుల వల్లనే ప్రజలు గుర్తుంచుకుంటున్నారని, అదేవిధంగా దేశ మొదటి పౌరురాలు ద్రౌపది ముర్ము గారిని బిజెపి అవమానించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్ ,జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, మాజీ పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పోల ఉష, తంబాకు చంద్రకళ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ ,పిసిసి డెలికేట్ ఈసా, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఆశాబి, ధర్మ గౌడ్, పద్మ, స్వామి గౌడ్, కైసర్, ముష్షు పటేల్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love