నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం దారులకు రెండవ విడత గొర్రెల పంపకం చేపట్టడంతో కురుమ గొల్ల గొర్రెల పెంపకం దారులకు శనివారం నాడు పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో గొర్రెల పెంపకం దారులకు పశు వైద్య డాక్టర్ బండి వార్ విజయ్ అభివృద్ధి పథకం పై అవగాహన కల్పించారు. ఈ సదస్సు మద్నూర్ రైతు వేదికలో చేపట్టగా ఇట్టి కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండగంగాధర్ మద్నూర్ సర్పంచ్ సూర్యకాంత్ ఉపసర్పంచ్ బాయిన్వర్ విట్టల్ బి ఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి కుశాల్ రచ్చవార్ మద్నూర్ పశువుల హాస్పిటల్ ఏడి వెంకటేశ్వర్ రెడ్డి మద్నూర్ మండల్ పశువైద్యాధికారి డాక్టర్ బండి విజయ్ గొర్రెల కాపర్లదారులు పాల్గొన్నారు.