- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
తెలుగుదేశం పార్టీ చారకొండ మండల అధ్యక్షుడుగా సండూరి శ్రీనయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. జిల్లా కమిటీ సభ్యులు తిమ్మయ్య, కాశన్న ఆధ్వర్యంలో సోమవారం నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా కాసాని యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏలే శ్రీనయ్య, కార్యనిర్వాహ కార్యదర్శిలుగా శ్రీనివాసులు, అనిశెట్టి నాగార్జున, నారోజు వెంకటయ్య, బొల్లంపల్లి అలివేలు, సండూరి అలివేలు, మోర ఆంజనేయులు, కోశాధికారిగా బండారి నిరంజన్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -