ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ఆందోళన..

Adivasis protest in front of Adilabad Collectorate..నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలోని కుమురం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసులకు సౌకర్యాలు కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ గోడం గణేష్ అన్నారు. సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ తో గురువారం కాలనీ నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరెంట్ స్తంభాలు, లైట్లు పోలిన వాటిని చూపిస్తు ఆందోళన చేపట్టారు. ధర్నా విషయమై పోలీసులు ముందస్తుగానే కలెక్టరేట్ ఎదుట భారీ పోలీసులను మోహరించి బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ… కుమురం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసులకు విద్య, వైద్యం, కరెంట్ లాంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. పిల్లల భవిష్యత్తుకు జిల్లా కేంద్రంలోని కుమురం భీం కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారన్నారు. పట్టాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని దరఖాస్తులు ఇచ్చిన.. దండాలు పెట్టిన ఎలాంటి చర్యలు లేవన్నారు. తాము ఆదివాసులుగా పుట్టడం నేరమ అని ప్రశ్నించారు. కరెంట్ లేకపోవడంతో రాత్రి సమయంలో విషసర్పలతో సమజీవనం చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవి వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, విద్యార్థి సంఘం జిల్లా ఉపధ్యక్షులు వరుణ్, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్, మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు లలిత బాయి, డివిజన్ ఉపాధ్యక్షులు గణపతి, రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు బుజంగ్ రావ్, రైతు సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు తులసి రాం, మావల మండల అధ్యక్షుడు ముకుంద్ రావ్, రూరల్ మండల అధ్యక్షులు కేశవ్ పాల్గొన్నారు.
Spread the love